Friday, January 24, 2025

7 నుంచి 13వరకు శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఈ నెల 7 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామివారు రామచంద్రకట్టపైకి వెంచేపు చేస్తారు. ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వామివారు ముందుగా ఉరేగింపుగా వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీగోవిందరాజ స్వామి వారి ఆలయ మాడ వీధులు, చిన్న బజారు వీధి, శ్రీ కోదండరామాలయం, మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకుంటారు.

అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపడతారు. ఆండాళ్ అమ్మవారు స్వామి వారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీ కోదండ రామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News