Wednesday, January 22, 2025

శ్రీచైతన్య అధినేత డా. బి.ఎస్.రావుకు ఘన నివాళ్లు

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా లక్షలామంది సంతాపం
విద్యారంగానికి ఆయన చేసిన సేవలను స్మరించిన ప్రముఖులు

హైదరాబాద్ : శ్రీచైతన్య విద్యాసంస్ధల అధినేత డా. బి.ఎస్.రావు కర్మ సంతాప సభలు దేశ వ్యాప్తంగా జరిగాయి. ఆదివారం మంగళగిరిలో డిజిపి కార్యాలయం దగ్గరలోని సి.కె. కన్వెన్షన్‌లో పెద్ద కర్మ కార్యక్రమాలు నిర్వహించగా ఆంద్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య మెయిన్ బ్రాంచీలలో సంతాపసభలు నిర్వహించి ఆయనకు ఘన నివాళుల్పరించారు. ఆయన చేసిన సేవలు కొనియాడుతూ వ్యక్తిత్వాన్ని , వారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రతిచోటా వేల సంఖ్యలో బంధుమిత్రులు, ప్రముఖులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్ని ఆయనకు సంతాపం తెలిపారు. దేశ విద్యారంగం చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డ్ ఫలితాలు సృష్టించి తెలుగు ప్రజల కీర్తిని జాతీయ స్దాయిలో రెపరెపలాడించిన మహోన్నత వ్యక్తి బి.ఎస్.రావుని ప్రశంసించారు. తొలి నుంచే శిక్షణలో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టి, సంచలనాత్మకమైన ప్రొగ్రామ్‌లు సృష్టించి అద్బుత ఫలితాలలో శ్రీచైతన్య అగ్రస్థానంలో నిలిపిన విద్యా ప్రధాతని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్దాయిలో అటు బోర్డు పరీక్షలతో పాటు ఇటు ఒలింపియాడ్‌లోనూ మర్వెవరికీ సాధ్యంకాని ఫలితాలతో చరిత్ర సృష్టించారు. శ్రీచైతన్య స్కూల్స్, కాలేజీలను 21రాష్ట్రాలలో విస్తరించి 900 పైగా బ్రాంచీలతో, 9 లక్షలకుపైగా విద్యార్థులతో, 50వేలకు పైగా అ ధ్యాపక ,అధ్యాపకేతర సిబ్బందితో ఆసియా ఖండంలోనే అతిపెద్ద విద్యాసంస్థగా నిలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News