Thursday, January 23, 2025

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన శ్రీచైతన్య స్కూల్

- Advertisement -
- Advertisement -

Sri Chaitanya School celebrated Yoga Day 2022

హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచీలలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్షలాదిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా శ్రీచైతన్య చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్‌మెంట్ శ్రీచైతన్య యాజమాన్యాన్ని అభినందించింది. ఈ సందర్భంగా అకడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ, శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యులమ్‌లో యోగాను ఒక భాగంగా చేర్చినట్లు తెలిపారు. అదేవిధంగా యోగాభ్యాసం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి మానసికంగా,శారీరకంగా ధృడంగా ఉంటారని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులు యోగా చేయడం ద్వారా చదువుతో పాటు అనేక ఇతర అంశాలలో కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరచవచ్చని చెప్పారు. అంతర్జాతీయ యోగాదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు,అధ్యాపక బృందానికి ఆమె అభినందనలు తెలిపారు.

Sri Chaitanya School celebrated Yoga Day 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News