హైదరాబాద్ : భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పరిసరాల్లో నేటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించనున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి ప్రకటించారు. తొలిరోజు ఆదిలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 16వ తేదీన సంతానలక్ష్మి, 17వ తేదీన గజలక్ష్మి, 18వ తేదీన ధనలక్ష్మి, 19వ తేదీన ధాన్యల క్ష్మి, 20వ తేదీన విజయలక్ష్మి, 21వ తేదీన ఐశ్వర్యలక్ష్మి, 22వ తేదీన వీరలక్ష్మి, 23వ తేదీన మహాలక్ష్మి, 24వ తేదీన (విజయదశమి) నిజరూపలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు శ్రీ మద్రామాయణ పారాయణం పారాయణం చేయనున్నారు.
దశమి నాడు భక్తులకు పటాభిషేకం, సంక్షేమ రామాయణ హవనం చేసుకునేందుకు ఆలయ అధికారులు అవ కాశం కల్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ మధ్యా హ్నం 3:30 నుంచిడి 4:30 గంటల వ రకు జరిగే కుంకుమార్చనలో మ హిళా భ క్తులు పాల్గొనవచ్చని ఆలయ ఈఓ రమాదే వి తెలిపారు. ఏఈవోలు శ్రావణ్ కు మార్, భవానీ రామకృష్ణ, ఈఈ రవీందర్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. దేవస్థానం ఆస్థానాచార్యులు కెఇ స్థలసాయి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
28వ తేదీన శబరియాత్ర
అక్టోబర్ 28వ తేదీన ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ సందర్భంగా భద్రాద్రి ఆలయ పరిసరాల్లో ఆలయ అధికారులు, అర్చకులు శబరి స్మృతియాత్ర నిర్వహించనున్నారు. అదే రోజు పా క్షిక చంద్రగ్రహణం కారణంగా పూజారులు సాయంత్రం పూజలు, దర్బార్ సేవ చుట్టు సే వ పూర్తి చేసి ఆలయ తలుపులు మూసివేస్తారు. 29వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ ఆలయ తలుపులు తెరుస్తారు.