Monday, January 20, 2025

సెమీస్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం థాయిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా మూడో విజయం సాధించిన శ్రీలంక సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన థాయిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 93 పరుగులు మాత్రమే చేసింది. వికెట్ కీపర్ నన్నపట్ (47) ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది.

లంక బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి థాయిలాండ్‌ను కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 11.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం అందుకుంది. ఓపెనర్లు విశ్వి గుణరత్నె 39 (నాటౌట్), చమరి ఆటపట్టు 49 (నాటౌట్) జట్టును గెలిపించారు. అంతకుముందు మలేసియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News