Friday, December 20, 2024

శ్రీలంకకు ఇక వీసా అక్కర్లేదు.. భారత టూరిస్టులకు ఫ్రీ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

కొలంబో: పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది. చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలూ ఇందులో ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనుంది. ఈమేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.

ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. ద్వీపదేశమైన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. విదేశీ మారకం దీని ద్వారానే సమకూరుతోంది. కొవిడ్ 19కు తోడు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం మూలంగా పర్యాటకుల రాక తగ్గింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి ఊపిరి పోయాలనే ఆ దేశం నిర్ణయించింది. 2023 సంవత్సరానికి గాను 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్షంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వీసా ఫ్రీ నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్ సమావేశం లోనే ఈ అంశం చర్చకు వచ్చింది. తొలుత 5 దేశాలకు వీసా ప్రీ ట్రావెల్‌కు అనుమతివ్వాలని భావించారు. దాన్ని తాజాగా 7 కు పెంచుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News