Wednesday, January 22, 2025

సూర్య, అక్షర్ మెరుపులు… పోరాడి ఓడిన టీమిండియా.

- Advertisement -
- Advertisement -

పుణె: టీ20 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగిన రెండో టి20లో భారత్ పోరాడి ఓడింది. లంక నిర్దేశించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఈషాన్ కిషన్(2), శుభమన్ గిల్(5), రాహుల్(5)లను ఔట్ చేసి టీమిండియాకు లంక బౌలర్లు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్దిక్ పాండ్యా(12), దీపక్ హుడా(9)లు కూడా నిరాశపర్చారు.

దీంతో టీమిండియా 57 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జతకట్టిన సూర్యకుమార్ యాదవ్(51), అక్షర్ పటేల్(65)లు చెలరేగడంతో మ్యాచ్ పై ఆశలు చిగురించాయి. అయితే, సూర్యకుమార్ భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. చివర్లో అక్షర్ కూడా ఔట్ కావడంతో టీమిండియా 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో లంక జట్టు సిరీస్ 1-1తో సమం చేసింది. కాగా, చివరి మూడో టీ20 మ్యాచ్ శనివారం జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News