Saturday, November 23, 2024

ఎదురులేని శ్రీలంక

- Advertisement -
- Advertisement -

హరారే : జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో శ్రీలంక వరుసగా తొమ్మిదో విజయాన్ని అందుకుంది. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన సూపర్ సిక్సెస్ చివరి మ్యాచ్‌లో లంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక ఇప్పటికే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధించగా విండీస్ బెర్త్‌ను దక్కించుకోవడంలో విఫలమైంది. లీగ్ దశలో నాలుగు, సూపర్ సిక్సెస్‌లో ఐదు మ్యాచుల్లో శ్రీలంక విజయం సాధించడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో లంక తలపడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 48.1 ఓవర్లలో 243 పరుగులకే కుప్పకూలింది. ఒంటరి పోరాటం చేసిన కియాసి కార్టీ 87 పరుగులు చేశాడు.

ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మహేశ్ తీక్షణ నాలుగు, హేమంత రెండు వికెట్లు పడగొట్టారు.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 44.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు పాథుమ్ నిశాంకా, దిముత్ కరుణరత్నె అద్భుత బ్యాటింగ్‌తో లంకను ఆదుకున్నారు. నిశాంకా 14 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. కరుణరత్నె 7 ఫోర్లతో 83 పరుగులు సాధించాడు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 190 పరుగులు జోడించారు. కాగా, కుశాల్ మెండిస్ 34 (నాటౌట్), సమరవిక్రమ 17 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News