- Advertisement -
లాహోర్: ఆసియాకప్ టోర్నమెంట్ నుంచి అఫ్గానిస్థాన్ వైదొలిగింది. మంగళవారం శ్రీలంకతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గాన్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో గ్రూప్‌బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ టీమ్‌లు సూపర్4కు అర్హత సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసిది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (41), కరుణరత్నె (3) శుభారంభం అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన కుశాల్ ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. అసలంక (32) కూడా తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 37.4 ఓవర్లలో289 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (59), మహ్మద్ నబి (65), రషీద్ ఖాన్ 27 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -