మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ఈ టోర్నీలు ఓటమెరకుండా తుది పోరుకు చేసిన హర్మన్ సేనకు ఊహించని షాక్ తగిలింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తీవ్రంగా విఫలమై తుది మెట్టుపై బోల్లా కొట్టింది. దీంతో టైటిల్ గెలుస్తుందని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది.
ఓపెనర్ స్మృతి మంధాన 60 (47 బంతులు: 10×4), రిచా ఘోష్ 30 (14 బంతులు : 4×4, 1×6), జెమీమా రోడ్రిగ్స్ 29 (16 బంతులు : 3×4, 1×6 )లు రాణించినా షెఫాలీ వర్మ(16), ఉమ చెత్రీ(9), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(11) ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 167 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు 61 (43 బంతులు : 9×4, 2×6), హర్షితా సమర విక్రమా 69 (51 బంతులు : 6×4, 2×6) అర్ధ శతకాలతో చెలరేగగా.. కవిషా దిల్‌హరి 30తో బ్యాట్ ఝులిపించింది. దీంతో భారత్‌కు భంగపాటు తప్పలేదు.