Wednesday, April 2, 2025

శ్రీలంక ఘన విజయం

- Advertisement -
- Advertisement -

బులవాయో: ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లోభాగంగా మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో శ్రీలంక 82 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ టోర్నీలో శ్రీలంకకు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా పది ఫోర్లతో 75 పరుగులు చేశాడు.

చరిత్ అసలంకా 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు. సమరవిక్రమ (26), ధనంజయ డిసిల్వా (23) పరుగులు చేశారు. మిగతావారు విఫలమయ్యారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో క్రీస్ నాలుగు, మార్క్ వాట్ మూడు, సోల్ రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 29 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ గ్రీవ్స్ 56 (నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. లంక బౌలర్లలో తీక్షణ మూడు, హసరంగ రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News