- Advertisement -
బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌ను శ్రీలంక 20తో క్లీన్‌స్వీప్ చేసింది. రెండో, చివరి టెస్టులో శ్రీలంక 192 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్యం బంగ్లాదేశ్ బుధవారం చివరి రోజు 318 పరుగులకు ఆలౌటైంది. మెహదీ హసన్ మీరాజ్ (81) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. లంక బౌలర్లలో లహిరు కుమార నాలుగు, కమిండు మెండిస్ మూడు, జయసూర్య రెండు వికెట్లను పడగొట్టారు. ఇంతకుముందు తొలి టెస్టులో కూడా లంక ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
- Advertisement -