కొలంబో: త్వరలో ప్రారంభం కానున్న ఐసిసి టి20 ప్రపంచకప్ కోసం శ్రీలంక 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. 2014 ప్రపంచకప్ విజేత అయిన శ్రీలంక ఈ సారి నేరుగా అర్హత సాధించలేకపోయింది. దీంతో అది ఇప్పటికే అర్హత సాధించిన జట్లతో క్వాలిఫైయర్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. అందులో విజయం సాధిస్తేనే సూపర్ 12కు అర్హత సాధిస్తుంది. శ్రీలంక ఉన్న గ్రూపు ఎలో నమీబియా, నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఇటీవలి పరిస్థితులు శ్రీలంకకు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ జట్టు ఆటగాళ్లు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ముగ్గురు ఆటగాళ్లు నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు బోర్డు నిర్ణయాలపై ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. శ్రీలంక ఆడిన గత 5 టి20 సిరీస్‌లలో ఒకే ఒక్కటి అది కూడా భారత్ బి జట్టుపై విజయం సాధించింది. ఇప్పుడు దాసన్ షనక సారథ్యంలో తిరిగి పుంజుకొని సత్తా చాటాలని భావిస్తోంది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 14న ముగుస్తుంది.
శ్రీలంక జట్టు: దాసన్ షనక (కెప్టెన్),ధనంజయ డిసిల్వా (వైస్‌కెప్టెన్), కుశాల్ జనిత్ పెరీరా, దినేశ్ చండీమల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, చరిత్ అసలంక, వనిందు హసరంగ, కమిందు మెండిస్, చమిక కరుణరత్నె, నువాన్ ప్రదీప్, దుషమంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, లహిరు మధుషంక, మహీష్ తీక్షణ.
రిజర్వ్ ఆటగాళ్లు: లహిరు కుమార, బినుర ఫెర్నాండో, అకిల దనంజయ, పులిన తరంగ.
Sri Lanka Confirm Team for ICC T20 World Cup