Sunday, December 22, 2024

అంకుల్ పెర్సీ ఇక లేరు

- Advertisement -
- Advertisement -

కొలొంబో: క్రికెట్ వీరాభిమాని అంకుల్ పెర్సీ(87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సో మవారం కన్నుమూశారు. శ్రీలంక క్రికెట్ జట్టుకు అంకుల్ పెర్సీ వీరాభిమాని. శ్రీలంక ఎక్కడ మ్యాచ్ ఆడినా సరే అక్కడి వెళ్లి జాతీయ జెండా పట్టుకుని తన జట్టుకు మద్దతుగా నిలుస్తాడు.

అంకుల్ పెర్సీ పూర్తి పేరు పెర్సీ అబేశేఖర. 1979 వన్డే ప్రపంచ కప్ నుంచి పెర్సీ అబేశేఖర జాతీయ జెండాను పట్టుకుని మైదానంలో వచ్చి శ్రీలంక జట్టును ఉత్సాహ పరిచేవారు. 2022 వరకు శ్రీలంక ఆడిన దాదాపు అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు హాజరయ్యాడు.

అయితే.. అనారోగ్యం కారణంగా గత ఏడాది కాలంగా అతడు మ్యాచ్‌లకు హాజరుకాలేకపోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు అతడి వైద్య ఖర్చుల కోసం సెప్టెంబర్‌లో రూ.50లక్షల చెక్కును అందజేసింది. కాగా, పెరీ మృతికి మాజీలు, దిగ్గజ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News