Sunday, January 19, 2025

నువాన్ హ్యాట్రిక్.. శ్రీలంకకు సిరీస్

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో, చివరి టి20లో శ్రీలంక 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక సిరీస్‌ను 21 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన కుశాల్ మెండిస్ 56 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మరో 6 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. నువాన్ తుషారా హ్యాట్రిక్‌తో సహా ఐదు వికెట్లు తీసి లంకను గెలిపించాడు. బంగ్లా కెప్టెన్ నజ్ముల్, తౌహిద్, మహ్మదుల్లాలను నువాన్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News