Friday, January 10, 2025

శ్రీలంక ఘన విజయం

- Advertisement -
- Advertisement -

బులవాయో : వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో లంకకు ఇది వరుసగా రెండో గెలుపు కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 30.2 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ఒమన్‌ను వందలోపే ఆలౌట్ చేశారు. ఒమన్ టీమ్‌లో ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. అయాన్ ఖాన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ జితేందర్ సింగ్ (21), ఫయాజ్ భట్ 13 (నాటౌట్)లు డబుల్ డిజిట్ స్కోరును సాధించారు.

లంక బౌలర్లలో వనిందు హసరంగ 7.2 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. లహిరు కుమారకు మూడు వికెట్లు దక్కాయి. వీరిద్దరి ధాటికి ఒమన్ బ్యాటింగ్ లైనప్ చాపచుట్టేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 15 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు పతున్ నిసాంకా, దిముత్ కరుణరత్నె ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టుకు పది వికెట్ల విజయాన్ని సాధించి పెట్టారు. ధాటిగా ఆడిన కరుణరత్నె 51 బంతుల్లోనే 8 ఫోర్లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, అద్భుత బౌలింగ్‌తో లంకను గెలిపించిన హసరంగకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News