- Advertisement -
కొలంబో: ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవమైన ప్రదర్శన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక 302 పరుగుల తేడాతో అవమానకర రీతిలో పరాజయం చవిచూసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన లంక ప్రభుత్వం శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేసింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసిందే అధికారికంగా ప్రకటించారు. కాగా, లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలో తాత్కాలికి కమిటీని నియమించినట్టు ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
- Advertisement -