Thursday, January 23, 2025

ఆస్ట్రేలియాపై లంక ఇన్నింగ్స్ విజయం..

- Advertisement -
- Advertisement -

Sri Lanka Innings Victory against AUS in 2nd Test

గాలే: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఇన్నింగ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను లంక 1-1తో సమం చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 554 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ క్రమంలో కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. స్టార్ ఆటగాడు దినేశ్ చండీమల్ అజేయ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన చండీమల్ 326 బంతుల్లో ఐదు సిక్సర్లు, 16 బౌండరీలతో అజేయంగా 206 పరుగులు చేశాడు. అతనికి కమిండు మెండిస్ (61), రమేశ్ మెండిస్ (29) అండగా నిలిచారు. దీంతో లంక తొలి ఇన్నింగ్లో 554 పరుగులు సాధించింది. ఈ క్రమంలో కీలకమైన 190 పరుగుల మొదటి ఇన్నింగ్స్ దక్కించుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా 151 పరుగులకే కుప్పకూలింది. ప్రభాత్ జయసూర్య రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగి పోయాడు. ఈసారి కూడా ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా జట్టులో లబుషేన్ (32), ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (29), డేవిడ్ వార్నర్ (24) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫలం కావడంతో ఆస్ట్రలేయాకు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. ఇక తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

Sri Lanka Innings Victory against AUS in 2nd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News