Thursday, January 23, 2025

తీవ్రమైన ఆహార అభద్రతలో అల్లాడుతున్న శ్రీలంక

- Advertisement -
- Advertisement -

Sri Lanka is reeling under severe food insecurity

6.3 మిలియన్ మంది పరిస్థితి అధ్యాన్నం
ఐక్యరాజ్యసమితి సంస్థల నివేదిక వెల్లడి

కొలంబో : శ్రీలంక లోని దాదాపు 6.3 మిలియన్ మంది తీవ్రమైన ఆహార అభద్రతలో కొట్టుమిట్టాడుతున్నారని వారి ప్రాణాలను రక్షించే సహాయం, జీవనాధారం సరిగ్గా కల్పించకుంటే ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారౌతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన రెండు సంస్థలు సోమవారం తాజా నివేదిక ద్వారా హెచ్చరించాయి. వరుసగా రెండు సీజన్లలో పంటలు సరిగ్గా పండలేదు సరికదా, ఉత్పత్తిలో 50 శాతం పడిపోయింది. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్య ఆంక్షలతో ఆహార ధాన్యాల దిగుమతులు బాగా తగ్గిపోయాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఒ), యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్లుఎఫ్‌పి) సంస్థలు నివేదికలో పేర్కొన్నాయి.

2022 లో వ్యవసాయ ఉత్పత్తి స్థాయిలు పరిశీలించడానికి ఎఫ్‌ఎఒ/డబ్లుఫ్‌పి , ఫుడ్ సెక్యూరిటీ అసెస్‌మెంట్ మిషన్ సంయుక్తంగా జూన్‌జులై మధ్యలో 25 జిల్లాలను పర్యవేక్షించాయి. ముఖ్యంగా ప్రధాన తృణధాన్యాల అందుబాటు, గృహాల వారీగా ఆహార భద్రతా పరిస్థితులను సమీక్షించాయి. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను రక్షించడానికి, సరైన జీవనాధారం కల్పించడానికి చొరవ తీసుకోకుంటే పరిస్థితి మరింత అధ్యాన్నంగా తయారౌతుందని హెచ్చరించాయి. అంత తీవ్రత లేకుండా ఉండాలంటే వ్యవసాయ ఉత్పత్తులను పునరుద్ధరించడానికి, జీవనాధారం పెంపొందించడానికి చిన్నరైతులను ప్రోత్సహించాలని శ్రీలంకకు చెందిన ఎఫ్‌ఎఒ ప్రతినిధి విమలేంద్ర షరన్ సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News