Friday, December 20, 2024

మూడో వికెట్ కోల్పోయిన లంక…

- Advertisement -
- Advertisement -

గౌహతి: బర్సాపార క్రికెట్ స్టేడియంలో శ్రీలంక-ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో 374 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన లంక 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 74 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అవిషకా ఫెర్నాడో ఐదు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కుశాల్ మెండిస్ పరుగులే చేయకుండా సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. అసలంకా 23 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. టీమిండియాలో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో 373 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లు ఇంకా 300 పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ(83), శుభమన్ గిల్(70) పరుగులు చేసి పర్వాలేదనిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News