Friday, December 20, 2024

18 ఓవర్లలో లంక 105/7

- Advertisement -
- Advertisement -

సెమీస్ లో చోటు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజీలాండ్ బౌలర్లు తడాఖా చూపిస్తున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో 18 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. ఓపెనర్ కుసాల్ పెరీరా మాత్రమే కాస్త చెప్పుకోదగిన స్కోరు చేశాడు. అతను 28 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేసి ఫెర్గూసన్ బౌలింగ్ లో సాంట్నర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధనంజయ డి సిల్వా 19 పరుగులు చేసి అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News