Monday, December 23, 2024

అదరగొడుతున్న బౌలర్లు.. ఏడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్ మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక తడబడుతోంది. సిరీస్ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్, శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. టీమిండియా బౌలర్లు లంకపై రెచ్చిపోతున్నారు. టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న లంక నడ్డి విరిచారు. 30 ఓవర్లకు లంక 160 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ముందు బ్యాటింగ్ కు దిగిన లంక 100 పరుగుల వరకు గట్టిగానే ఆడింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మాయాజాలంతో లంక బ్యాటర్లను ఇబ్బందుల్లోకి నెట్టాడు. కేవలం 25 పరుగుల్లోనే శ్రీలంక 4 కీలక వికెట్లను కోల్పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News