- Advertisement -
న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అంతకంతకు పెరిగిపోతోంది. రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స శుక్రవారం రాత్రి అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. 2 కోట్ల 20 లక్షల మంది ప్రజలున్న శ్రీలంకలో గురువారం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనుమానితులను విచారణ లేకుండానే సుదీర్ఘకాలంపాటు నిర్బంధించేందుకు సైన్యానికి అనుమతిస్తూ కఠినతరమైన చట్టాలను రాజపక్స ప్రకటించారు. ఇదిలా ఉండగా శ్రీలంకలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సబ్సిడరీ లంక ఐఒసి విద్యుత్ కొరతను తగ్గించేందుకు 6000 మెట్రిక్ టన్ను ఇంధనాన్ని సరఫరా చేస్తానంది. కాగా భారతీయ వాణిజ్యవేత్తలు శ్రీలంకకు 40వేల టన్నుల బియ్యాన్ని పంపిస్తామని శనివారం ప్రకటించారని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తెలిపింది.
- Advertisement -