జాఫ్నా: శ్రీలంక అధ్యక్ష ఎన్నిలు శనివారం మొదలయ్యాయి. 2022లో శ్రీలంక ఆర్థికంగా చితికిపోయాక అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో మొత్తం 38 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నిక ముక్కోణపు పోటీగా ఉందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్న రణిల్ విక్రెమెసింఘే, ప్రతిపక్ష నాయకుడు సజీత్ ప్రేమదాస, ప్రముఖ ప్రతిపక్ష శాసన సభ్యుడు అనుర కుమార దిస్సనాయకె మధ్యనే ఈ ముక్కోణపు పోటీ ఉందంటున్నారు. ఈ ముగ్గురు నేతలు ఆర్థిక సంక్షోభం నుంచి, ప్రజల కష్టాల నుంచి గట్టెక్కిస్తామని వాగ్దానాలు చేశారు.
ఇప్పటి వరకు 20 శాతం పోలింగ్ కొలంబోలో జరిగింది. ఇక గల్లే లో 18 శాతం, కురునెగల లో 30 శాతం, పొలోన్నరువ లో 38 శాతం పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అయితే ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన 85 ఫిర్యాదులు శ్రీలంక ఎన్నికల సంఘానికి అందాయి.