Wednesday, December 25, 2024

వన్డే వరల్డ్ కప్‌కు లంక అర్హత

- Advertisement -
- Advertisement -

బులవయో : వన్డే వరల్డ్ కప్‌కు శ్రీలం అర్హత సాధించింది. సూపర్6లో పసికూన జింబాబ్వేపై విజయం సాధించడంతో ఈ మెగాటోర్నికి క్వాలీఫై అయ్యింది. ఆదివారం జింబాబ్వేతో మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకే చాపచుట్టేసింది. సీన్ విలియమ్సన్ (57 బంతుల్లో 56; 6×4, 1×6) అర్ధ సెంచరీతో రాణించగా సికిందర్ రజా(31) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్లు ఎవరూ రాణించక పోవడంతో తక్కువ స్కోరుకే అతిధ్య జట్టు ఆలౌట్ అయ్యింది. ఇక శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 వికెట్లతో మెరిశాడు. మధుషంకా 3 వికెట్లు తీశాడు. పతిరణా 2 వికెట్లు సాధించాడు.

అనంతరం లక్ష ఛేదనకు దిగిన శ్రీలంక 33.1 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే నష్టపోయి 169 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ నిస్సంకా(102 బంతుల్లో 101; 14×4) అజేయ సెంచరీతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. దిముత్ కరుణరత్నే(30), కుశాల్ మెండీస్ (25 నాటౌట్; 2×4)లతో లంక గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన శ్రీలంక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్లోడుగుపెట్టింది. దీంతో భారత్‌లో వన్డే ప్రపంచకప్ 2023కు క్వాలీఫై అయ్యింది.
రెండో స్థానం.. మూడు జట్లు
క్వాలిఫయర్ టోర్నీలో ఫైనల్ చేరిన రెండు జట్లు ప్రపంచకప్ కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే శ్రీలంక సాధించగా.. వెస్టిండీస్ స్కాట్‌లాండ్ చేతిలో ఓడి అర్హత కోల్పోయింది. ఇక మిగిలిన బెర్త్ కోసం మూడ జట్టు పోటీ పడుతున్నాయి. వాటిలో జింబాబ్వే 6 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా స్కాట్లాండ్ 4, నెదర్లాండ్స్ 2 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. జింబాబ్వే ఫైనల్ కు చేరాలంటే స్కాట్లాండ్‌పై ఆడనున్న చివరి మ్యాచ్‌లో తప్పకుండా నెగ్గాలి. ఇక విండీస్‌ను చిత్తుచేసిన స్కాట్లాండ్ ఫైనల్‌కు చేరాలంటే జింబాబ్వే, నెదర్లాండ్స్‌లపై వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ గెలవాల్సి ఉంది. నెదర్లాండ్స్ ఫైనల్ చేరాలంటే.. ఒమన్, స్కాట్లాండ్ జట్లపై భారీ తేడాతో నెగ్గాలి. జింబాబ్వేపై స్కాట్లాండ్ విజయం సాధించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News