Sunday, January 19, 2025

శ్రీలంక సిరీస్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

జులై 26న తొలి టి20
ముంబై: శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించిన వివరాలను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) గురువారం ప్రకటించింది. శ్రీలంకలో పర్యటించే భారత్ మూడు టి20లు, 3 వన్డేలు ఆడుతుంది. ప్రస్తుతం టీమిండియా టి20 సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు లంకలో పర్యటిస్తోంది. సిరీస్‌లో పాల్గొనే జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన గౌతం గంభీర్ ఈ సిరీస్ ద్వారా తన బాధ్యతలను చేపట్టనున్నాడు. ఇక సీనియర్లు రోహిత్ శర్మ, బుమ్రా, సిరాజ్, విరాట్ కోహ్లి తదితరులు లంక సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

కాగా, లంక పర్యటనలో భారత్ తొలుత మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. జులై 26న తొలి టి20 జరుగుతుంది, రెండో టి20 27న, మూడో, చివరి టి20 జులై 29 జరుగుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ పల్లెకెలె వేదికగా కొనసాగుతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల నుంచి టి20 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక ఆగస్టు ఒకటిన తొలి వన్డే జరుగుతుంది. 4న రెండో వన్డే, ఆగస్టు ఏడున మూడో వన్డే జరుగుతుంది. వన్డే మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరుగుతాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. కాగా, చాలా రోజుల తర్వాత భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. దీంతో సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News