Monday, January 20, 2025

ఇంగ్లండ్‌కు లంక షాక్

- Advertisement -
- Advertisement -

చెల్మ్‌ఫోర్డ్ : ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో మహిళల టి20 మ్యాచ్ లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటి ంగ్ చేసిన ఇంగ్లండ్ మహిళలు 18 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలారు. చార్లొటే డీన్ ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది. ప్రత్యరి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డీన్ 4 ఫోర్లతో 34 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో బౌచర్ (12), కెప్టెన్ నైట్ (14), వికెట్ కీపర్ అమీ జోన్స్ (12), వాంగ్ (13) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. లంక బౌలర్లలో ప్రబోధని, రణవీరా, కవిశా దిహారి రెండేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 13.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ చమారి ఆటపట్టు (55) విధ్వంసక ఇన్నింగ్స్‌తో లంకను ఆదుకుంది. హర్షిత 30 (నాటౌట్), విష్మి గుణరత్నె 18 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో లంక అలవోక విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News