Thursday, April 3, 2025

శ్రీలంక టీమ్ ఎంపిక

- Advertisement -
- Advertisement -

కొలంబో: భారత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. దాసున్ శనక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుశాల్ మెండిస్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గాయంతో బాధపడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగకు జట్టులో చోటు దక్కలేదు. ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరా కూడా జట్టుకు ఎంపిక కాలేదు. కాగా, మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును లంక క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. శనక, కుశాల్, కుశాల్ పెరీరా, నిశాంక, కరుణరత్నె, సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దుషన్ హేమంత, మహీశ్ తీక్షణ, వెల్లలాగే, పతిరణ, లహిరు కుమార, మధుశంక జట్టులో చోటు దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News