న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా (1) మరోసారి నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నెతో కలిసి దినేశ్ చండీమల్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన కరుణరత్నె 4 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఇదే సమయంలో రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు.
ఇక కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన చండీమల్ 208 బంతుల్లో 16 బౌండరీలతో 116 పరుగులు సాధించాడు. మరోవైపు ఎంజిలో మాథ్యూస్, కమిందు మెండిస్‌లు అజేయ అర్ధ సెంచరీలతో జట్టుకు అండగా నిలిచారు. మాథ్యూస్ ఆరు ఫోర్లతో 78 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ధాటిగా ఆడిన కమిందు 56 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 51 పరుగుల సాధించాడు. దీంతో లంక స్కోరు 306 పరుగులకు చేరింది. కాగా, సిరీస్‌లో ఆతిథ్య టీమ్ లంక 10 ఆధిక్యంలో కొనసాగుతోంది.