Sunday, December 22, 2024

శ్రీలంకదే సిరీస్

- Advertisement -
- Advertisement -

కొలంబో: జింబాబ్వేతో గురువారం జరిగిన మూడో, చివరి టి20లో ఆతిథ్య శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో లంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలి టి20లో లంక, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధించాయి. కీలకమైన మూడో టి20లో గెలిచిన లంక సిరీస్‌ను దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 14.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. బ్రియన్ బెన్నెట్ ఏడు ఫోర్లతో 29 పరుగులు చేశాడు.

మిగతావారిలో ఓపెనర్ టినాశే (12), సీన్ విలియమ్స్ (15), కెప్టెన్ సికందర్ రజా (10) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో కెప్టెన్ వనిందు హసరంగ నాలుగు, మాథ్యూస్, తీక్షణ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 10.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు నిశాంకా 39 (నాటౌట్), కుశాల్ మెండిస్ (33) శుభారంభం అందించారు. ధనంజయ డిసిల్వా 15 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News