ఆక్లాండ్: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టి20లో లంక ‘సూపర్’ విజయం సాధించింది. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక కివిస్‌పై గెలుపొందింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. అనంతరం 9పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మూడు బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా 12పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్లు నష్టానికి చేసింది. కుశాల్ పెరీరా అసలంక (67) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం శ్రీలంక నిర్దేశించిన 197పరుగుల లక్ష ఛేదనలో కివీస్ 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి చేసింది. డారిల్ మిచెల్ 66పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇరుజట్లు స్కోరు సమం అవడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో శ్రీలంక గెలవగా అసలంక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో టి20 డునెడిన్ వేదికగా ఈ నెల జరగనుంది.