చివరి మ్యాచ్‌లో విండీస్‌పై గెలుపు
అబుదాబి: ప్రపంచకప్‌లో శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంకకు ఇది రెండో విజయం కాగా, విండీస్‌కు మూడో ఓటమి కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసి పరాజంయ పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు క్రిస్ గేల్ (1), ఎవిన్ లూయిస్ (8) నిరాశ పరిచారు. మరోవైపు నికోలస్ పూరన్, షిమ్రోన్ హెట్‌మెయిర్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు.
పూరన్ ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హెట్‌మెయిర్ 54 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 81 ఫోర్లతో అజేయంగా 81 పరుగులు చేశాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందుకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు నిశాంక, కుశాల్ పెరీరాలు జట్టుకు శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నిశాంక ఐదు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. కుశాల్ పెరీరా 29 పరుగుల సాధించాడు. ఇక ధాటిగా ఆడిన అసలంక 8 ఫోర్లు, సిక్సర్‌తో 41 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. కెప్టెన్ శనకా 25 (నాటౌట్) కూడా దూకుడుగా ఆడడంతో లంక స్కోరు 189 పరుగులకు చేరింది.