Tuesday, December 24, 2024

మళ్లీ ఓడిన భారత్

- Advertisement -
- Advertisement -

రాణించిన నిసాంక, మెండిస్

లంకకు మరో గెలుపు

దుబాయి : ఆసియాకప్‌లో టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన సూపర్4 మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ ఓటమితో టీమిండియా ఫైనల్ అవకాశాలు దాదాపు అడుగంటాయి. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన శ్రీలంక ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్ వల్ల టీమిండియా చేజేతులా ఓటమి పాలైంది. వి

కెట్ కీపర్ రిషబ్‌పంత్ పేలవమైన ఫీల్డింగ్‌తో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్‌లు లంకకు శుభారంభం అందించారు. నిసాంకా 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 52, కుశాల్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేశారు. ఇక చివర్లో భానుక రాజపక్స 25 (నాటౌట్), దాసున్ శనకా 33 (నాటౌట్) అద్భుత పోరాట పటిమను కనబరచడంతో లంక చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 41 బంతుల్లోనే 4 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 72 పరుగులు చేశాడు. మిగతావారిలో సూర్యకుమార్ (34) మాత్రమే రాణించాడు. కోహ్లి (0), రాహుల్ (6) నిరాశ పరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News