Monday, December 23, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న శ్రీలంక నటి రాశిప్రభ సందీపని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతిని అర్థం చేసుకుంటే ప్రపంచంలో సమస్యలే ఉండవని  నటి రాశిప్రభ సందీపని అన్నారు. తన తాజా సినిమా షూటింగ్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆమె గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం రాశి ప్రభ మాట్లాడుతూ తను పుట్టి పెరిగిన శ్రీలంకలో ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇప్పటికి నదులు, అడవులు సురక్షితంగా ఉన్నాయని. వీటి వల్లే శ్రీలంకకు టూరిజం పెరిగి లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు తగ్గాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని, అందులో భాగంగా ఇండియాలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించడం, ఉద్యమంలా ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషం కలిగించిందని తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాల్లో పర్యటించానన్నారు, అనేక మంది పర్యావరణవేత్తలను కలిశానని తెలిపారు. కానీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని తాను ఎక్కడా చూడలేదని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించి కోట్లాది మొక్కలు నాటిస్తున్న ఎంపి సంతోష్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపి సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని శ్రీలంకలో విస్తరించేలా తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News