- Advertisement -
కొలంబో: శ్రీలంక ప్రాదేశిక జలాలలోకి అక్రమంగా చొరబడ్డారన్న ఆరోపణపై నెల రోజుల క్రితం శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన 11 మంది భారతీయ జాలరులు స్థానిక న్యాయస్థానం అదేశాల మేరకు మంగళవారం విడుదలయ్యారు. ఉత్తర శ్రీలంకలోని డెల్ఫ్ దీవి సమీపంలో ఫిబ్రవరి 7న ఈ 11 మందిని శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసింది. వీరికి చెందిన మూడు ఫిషింగ్ ట్రాలర్లను నౌకాదళం స్వాధీనం చేసుకుంది. కేట్స్ కోర్టు ఆదేశాల మేరకు జాఫ్నా జైలు నుంచి 11 మంది భారతీయ జాలరులు విడుదలయ్యారని, జాఫ్నాలోని భారత కాన్సులేట్ వారికి న్యాయ సహాయం అందచేసి వారి విడుదలకు చర్యలు తీసుకుందనిజాఫ్నాలోని కాన్సులేట్ జనరల్ రాకేష్ నటరాజ్ జయభాస్కరన్ ట్వీట్ చేశారు. ఏడాదిన్నర కారాగార శిక్ష విధించగా దాన్ని పదేళ్ల పాటు నిలుపుదల చేస్తూ వారిని విడుదల చేసినట్లు జాఫ్నాలోని మత్సశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె సుధాకరన్ తెలిపారు.
- Advertisement -