Thursday, January 23, 2025

ఫేస్‌బుక్ ప్రేమ ఎపికి వచ్చిన ఆ దేశం యువతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: చిత్తూరు జిల్లా వి.కోట మండలం అరిమాకులపల్లెకు చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి బెలంగుడు ప్రాంతానికి చెందిన శ్రీలంక యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 6 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. విఘ్నేశ్వరి ఈ నెల 8న టూరిస్ట్ వీసాపై చెన్నైకి రాగా, లక్ష్మణ్ ఆమెను కలుసుకుని స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అదే నెల 20వ తేదీన ఓ గుడిలో పెళ్లి చేసుకున్న విఘ్నేశ్వరి ప్రస్తుతం లక్ష్మణ్‌ వద్దే ఉంటూ అతని కుటుంబసభ్యురాలిగా మారింది.

అయితే లక్ష్మణ్‌తో విఘ్నేశ్వరి పెళ్లి విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఆమె వీసాను తనిఖీ చేశారు. ఆమె వీసాకు ఆగస్టు 6 వరకు గడువు ఉన్నందున, ఆమె దేశం విడిచి వెళ్లాలని నోటీసు ఇచ్చారు. అయితే విఘ్నేశ్వరి తన వీసాను పొడిగించుకుని భారత్‌లోనే ఉండాలని కోరింది. విదేశీ యువతి వివాహాన్ని రిజిష్టర్‌ చేసి తల్లిదండ్రులకు తెలియజేయాలని పోలీసులు సూచించారు. విఘ్నేశ్వరి ఇండియాలోనే ఉండాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ విషయాన్ని ఎలా పరిగణిస్తారో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News