- Advertisement -
శ్రీలంక నౌకాదళం అదుపులో మొత్తం 55 మంది జాలర్లు
కొలంబో: తమ దేశ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన మరో 12 మంది భారతీయ జాలరులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసి రెండు మర పడవలను స్వాధీనం చేసుకుంది. దీంతో గత రెండు రోజుల్లో శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన భారతీయ జాలర్ల సంఖ్య 55కు పెరిగినట్లు శ్రీలంక ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మన్నార్‌కు దక్షిణాన శ్రీలంక సముద్ర జలాలలో ఈ అరెస్టులు జరిగాయి. జాఫ్నాలోని డెల్ఫ్ ద్వీపానికి సమీపంలో శ్రీలంక సముద్ర జలాల్లో ఆదివారం 43 మంది భారతీయ జాలరులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసి ఆరు ఫిషింగ్ ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. చట్టపరమైన చర్యల నిమిత్తం భారత జాలరులకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించిన అనంతరం కొవిడ్ నిబంధనల మేరకు వారిని సంబంధిత అధికారులకు అప్పగించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
- Advertisement -