Wednesday, January 22, 2025

21నుంచి శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘె భారత్‌లో పర్యటన

- Advertisement -
- Advertisement -

కొలంబో : శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘె ఈ నెల 21 నుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీని ఆయన కలుసుకుని వివిధ అంశాలపై చర్చిస్తారని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గత ఏడాది శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తడం, ప్రజాందోళనలు, చివరకు గొటాభయ రాజపక్ష అధికార పీఠం నుంచి వైదొలగవలసి రావడం తదితర పరిణామాలు ఎన్నో సంభవించాయి. అధ్యక్షునిగా విక్రమ్ సింఘె గత ఏడాది జులైలో పగ్గాలు చేపట్టిన తరువాత భారత్‌లో పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.

Also Read: కెనడాలో ఇండియన్..ఖలీస్థాన్ ఢి

ఈ సందర్భంగా తగిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి భారత్‌కు చెందిన విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వచ్చే వారం భారత్‌కు రానున్నారు. విక్రమ్ సింఘె భారత్‌కు వచ్చే ముందు విద్యుత్, ఇంధనం, వ్యవసాయం, సాగరజలాల భద్రత తదితర భారత ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఖరారు చేసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. విక్రమ్ సింఘెతోపాటు శ్రీలంక మత్స శాఖ మంత్రి డగ్లస్ దేవానంద, విద్యుత్ ,ఇంధనం మంత్రి కాంచన విజేశేఖర, విదేశీ వ్యవహారాల మంత్రి అలి సబ్రి, అధ్యక్ష సిబ్బంది చీఫ్ సగల రత్నాయకే కూడా భారత్‌కు రానున్నారు. ఆర్థిక దివాలా పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే తాత్కాలికంగా అభివృద్ధి సంకేతాలు శ్రీలంకలో కనిపిస్తున్న తరుణంలో విక్రమ్ సింఘే పర్యటించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News