Monday, December 23, 2024

మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తూ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద- ది ఎటాకర్’ రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, థమన్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్‌లో ఉంది. ఈలోగా మేకర్స్ ఆఫ్‌లైన్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.

ఈ ఫిల్మ్ స్టాండీలు విడుదలయ్యాయి, అన్ని చోట్ల ఏర్పాటు చేయబడ్డాయి. స్టాండీ ఇమేజస్ ఒకదానిలో రామ్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. మరొక ఇమేజ్ రామ్, శ్రీలీల రొమాంటిక్ కెమిస్ట్రీని అద్భుతంగా చూపించింది. యాక్షన్ పోస్టర్ మాస్‌ని ఆకట్టుకుంటే రొమాంటిక్ పోస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News