Monday, January 20, 2025

శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

- Advertisement -
- Advertisement -

తిరుమ‌ల‌: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు మంగళవారం ఉత్త‌ర మాడ వీధిలో గ‌ల శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి జ‌యంతి శ్రావణ పౌర్ణమి నాడు జ‌రిగింది. ఆ మ‌రుస‌టి రోజు స్వామి, అమ్మ‌వార్లు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో వైఖాన‌స ఆగ‌మం ప్ర‌కారం నిత్య‌కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాలు జ‌రుగుతాయి. ఈ వైఖాన‌స ఆగ‌మ‌శాస్త్రాన్ని శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి ర‌చించారు. సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఆస్థానం నిర్వ‌హించి నివేద‌న చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News