Saturday, November 23, 2024

తెలుగు ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పితృ వాక్కు పాలకుడు, ప్రజా వాక్కు పాలకుడు శ్రీ రాముడు అని, రాజులు, రాచరిక వ్యవస్థ ఉన్న కాలంలోనూ సత్యం, న్యాయం, ధర్మంతో ప్రజల మాటకు విలువనించారని, ప్రజాస్వామ్య పాలన చేసిన మహనీయ వ్యక్తి శ్రీ రాముడు, ఆయన పాలన అప్పటికి.. ఇప్పటికి.. ఎప్పటికి.. ఆదర్శ ప్రాయమేనని కొనియాడారు.  మనం ఉన్న ఈ ప్రజాస్వామ్య పరిపాలనా కాలంలో.. ప్రజలకు మరింత జవాబుదారితనంతో పాలన అందిస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితమైన జవాబుదారితనంతో ఉందని పేర్కొన్నారు.

భద్రాచల సీతారమచంద్ర స్వామి కల్యాణం అసలైన మత సామరస్యానికి, లౌకిక వాదానికి ప్రతీకగా నిలుస్తుందని, కులీ కుతుబ్ షా కాలం నుంచి ఇప్పటివరకు సీతారామచంద్రస్వామి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఆ సీతారాముల అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం సర్వ సుభిక్షంగా ఉండాలని, తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని భట్టి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News