Tuesday, November 5, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. 22 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులోకి 90,190 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. దీంతో 95,952 క్యూసెక్కుల వరద నీటిని కిందకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా ప్రస్తుతం 1088 అడుగులు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 90.3 టిఎంసిలుకాగా ప్రస్తుతం 76.424 టిఎంసిలుగా ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News