Wednesday, January 22, 2025

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కెసిఆర్‌ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరిగే రామ మందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బిఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు శ్రీరామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరినీ ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్‌కు కూడా ఆహ్వాన పత్రం పంపించారు. అయితే, కెసిఆర్‌కు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News