Tuesday, April 8, 2025

కల్యాణం… కమనీయం!

- Advertisement -
- Advertisement -

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

రామనామస్మరణతో మార్మోగిన భద్రగిరి.. తరించిన భక్తజనం
ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు
సమర్పించిన సిఎం రేవంత్‌రెడ్డి దంపతులు నేడు
పురుషోత్తముడికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: జగదానంద కారకుడు.. జగదభిరాముడు.. భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక ఆదివారం భద్రాచలంలో కన్నుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరపున సిఎం రేవంత్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తజనం పులకించారు. లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా సాగిం ది. తెల్లవారు జామున 2 గంటలకు ఆలయా న్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన ఉదయం 4 నుం చి 5 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ధృవమూర్తుల కల్యాణం నిర్వహించారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత కల్యాణ మూర్తులకు అలంకరణ చేసి మిథిల మంటపడానికి ఊరేగింపు గా తీసుకొచ్చారు. మిథిల మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10.30 గంటలకు వేద మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ ఘట్టం ప్రారంభమైంది.

Sri rama navami at Bhadrachalam

మొదట మేళతాళాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ క్రతువులో తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణానికి ఉపయోగించే సామగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్షధారణ చేశారు. 12 దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ వారి నడుముకు అలంకరించారు. యోక్షధరణ చేయడం ద్వారా గర్భస్త దోషాలు తొలగుతాయని చెబుతారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోప వితరణ చేసి కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చల హారం సహా పలు ఆభరణాలను స్వామి, అమ్మవారికి అలంకరించారు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా, జానకీ దోసిట తలంబ్రాలు మనిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ మిథి ల మైదానం భక్తి పారవశ్యంలో ఓలలాడింది.

Sri rama navami at Bhadrachalam

శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ కాంతులతో కళకళలాడిన పురుషోత్తముడికి సోమవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మ హోత్సవం జరుగనుంది. మిథిలా స్టేడియం లో నేత్రపర్వంగా నిర్వహించిన సీతారాము ల కళ్యాణ వేడుకల్లో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరహరి, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, భద్రాచలం, పినపాక, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం ఎంఎల్‌ఎలు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధ ర్ పాల్గొన్నారు. స్వామివారి కల్యాణ వేడుకల్లో హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద, ఎపి హైకోర్టు జడ్జి కృష్ణమోహన్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల జడ్జిలు రాజగోపాల్, పాటిల్ వసంత్ పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు కలెక్ట ర్ జితేష్ వి.పాటిల్ నేతృత్వంలో జిల్లా యం త్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ఉదయం 5 గంటలకు సెక్టార్‌కు చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరుగకుండా ఎస్‌పి రోహిత్‌రాజు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News