Saturday, April 12, 2025

సీతారాముల కళ్యాణం.. ముస్తాబైన భద్రాచలం

- Advertisement -
- Advertisement -

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భద్రాచలం ముస్తాబైంది. కనులారా సీతారాముల కళ్యాణం చూసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీగా భక్తులు భద్రాచలానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, పోలీసులు భారీగా మోహరించి..పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా,

సీతారాముల కళ్యాణ ఉత్సవాల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి దంపతులు సమర్పించనున్నారు. సిఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News