Monday, April 7, 2025

రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

నేడు భద్రాద్రిలో సీతారాముల
కల్యాణం భక్తులకు సకల
సౌకర్యాలు తొలిసారి సిఎం హోదాలో
భద్రాద్రి రానున్న రేవంత్‌రెడ్డి
స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల
తలంబ్రాలు సమర్పించనున్న సిఎం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: అయోధ్య త రువాత అంతటి పేరుగాంచిన భద్రాద్రి దివ్య క్షేత్రంలో రాములోరి పెళ్లికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం పుణ్యక్షేత్రం స ర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అత్యంత వై భవోపేతంగా జరిగే ఈ కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కా కుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భ క్తకోటి తరలివస్తున్నారు. అభిజిత్ లగ్నంలో క ల్యాణం జరగనుండగా ముందుగా తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు. ఆలయం నుంచి మంగళ వాయిద్యాలతో మిథిల కళ్యాణ మండపానికి ఉత్సవమూర్తులను తీసుకువస్తారు. అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లాన్ని సీ తారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తమని జగత్ కల్యాణ శుభ సన్నివేశం గా కీర్తిస్తారు. ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాముల వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ముఖ్యమంత్రితోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సి ఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎంపిలు, ఎంఎల్‌ఎలు, పలువురు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ప్రత్యేకంగా 24 సెక్టార్లు ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొ త్తం 31,860 మంది సెక్టార్లో కూర్చొని కళ్యా ణ తిలకించే అవకాశం ఉండగా ఇందులో 16,860మంది టికెట్లను కొనుగోళ్ళు చేసి, మ రో 15 వేల మంది స్టేడియం గ్యాలరీ ద్వారా ఉచితంగా తిలకించే అవకాశం ఉంది. ప్రతి సె క్టార్‌లో ఎల్‌ఇడి టివిలు ఏర్పాటు చేశారు. అత్యవసరంగా 20 ద్వారాల నుంచి బయటకు వె ళ్ళేందుకు అవకాశం ఉండగా 9 ద్వారాల నుం చి లోపలికి, మరో నాలుగు ద్వారాల నుంచి బయటకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఎం డలు, ఉక్కబోతతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో చలువ పందిళ్లు, 50 ట న్నుల ఎసితో పాటు, వంద కూలర్లు, 270 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

విద్యుద్దీపాలతో అలంకరణ
శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కల్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభితమైన మండపాన్ని చక్క గా అలంకరించారు. కల్యాణ మహోత్సవం సం దర్భంగా భక్తుల కోసం 2.50 లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. వీటిని 20 ప్రసాద విక్రయ కౌంటర్ల ద్వారా విక్రయించనున్నారు. మిథిలా స్టేడియంలోనే సోమవా రం శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జి ష్ణుదేవ్ వర్మ హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ సుమారు 1,800 వేల మందికి పైగా పోలీ సు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

కన్నల పండువగా ఎదుర్కోళ్ళు ఉత్సవం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధి లో జరుగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం రాత్రి భక్తుల జయజయధ్వానాల మధ్య వైభవోపేతంగా సాగింది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సాగి న ఎదుర్కోలు వేడుక భక్తులను రంజింపజేసిం ది. ఉత్తర ద్వార దర్శనం ఎదురెదురుగా శ్రీ రాములవారు, సీతమ్మ తల్లి ఆశీనులు కాగా వే దపండితులు, అర్చకులు పోటాపోటీగా వారిని కీర్తించారు.వధూవరుల వంశ కీర్తి ప్రతిష్ఠలను వేదపండితులు వివరించారు. చూడచక్కనివా డు, ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరఫు పురోహితులు కీర్తించగా.. సుగుణాల రాశి సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్ఠలంటూ సీతమ్మ తల్లి తరఫుపున అర్చకులు అమ్మ వారిని కీర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News