- Advertisement -
కొత్తగూడెం భద్రాద్రి: భద్రాచలంలో శ్రీరాముల నవమి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరుగుతోంది. పరిమిత సంఖ్యలోనే భక్తులు, అతిథులకు అనుమతి ఇచ్చారు. నిత్య కల్యాణ మండపంలో కల్యాణ క్రతువు జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రేపు శ్రీ సీతారామచంద్ర స్వామికి మహాపట్టాభిషేకం జరగనుంది. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించారు. కొవిడ్ కారణంగా పూజలు, తీర్థ ప్రసాదాలు పూర్తిగా నిలిపివేశారు.
- Advertisement -