Wednesday, January 22, 2025

నగరంలో ప్రశాంతంగా శోభాయాత్ర

- Advertisement -
- Advertisement -
Sri Rama Navami Shobha Yatra peaceful in hyderabad
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కోవిడ్ వల్ల రెండేళ్లు వాయిదా పడిన శోభాయాత్ర
7,000ల మందితో భారీ బందోబస్తు

హైదరాబాద్: రెండేళ్ల తర్వాత చేపట్టిన శ్రీరాముడి శోభాయాత్ర హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. శ్రీరామనవమి, రంజన్ మాసం ఒకేసారి రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జిల్లాల నుంచి 1,000 మంది పోలీసులు, నగరంలోని 6,000మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే తెలిసే విధంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న అన్ని సిసి కెమెరాలు పనిచేసేలా చేశారు. అంతేకాకుండా డ్రోన్ల సాయం కూడా తీసుకుని, ఎస్‌బి పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో కూడా ఉంచారు. హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. సీతారంబాగ్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర బోయిగూడ కమాన్, గౌలిగూడ ఎక్స్ రోడ్డు, గాంధీ విగ్రహం, బేగంబజార్, శంకర్‌హోటల్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్డు, ఆంధ్రా బ్యాంక్ నుంచి హనుమాన్ వ్యాయామ శాలకు చేరుకోవడంతో శోభాయాత్ర ముగిసింది.

శాంతియుత వాతారణానికి అందరూ సహకరించాలిః సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్

నగరంలో శాంతియుత వాతావరణం ఉండేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. నగరంలో రెడేళ్ల తర్వాత చేపట్టిన శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి శోభాయాత్ర నిర్వహించలేదని తెలిపారు. వారం రోజుల నుంచి ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించామని పోలీసులకు వారు కూడా సహకరించారని తెలిపారు. అందరి కృషి వల్లే శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. ఇదే కాకుండా నగరంలోని అంబర్‌పేట, బేగంపేట చెందిన కోర్టు నుంచి శోభాయాత్రకు అనుమతి తెచ్చుకున్నారని, అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు ఎదురు కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అన్ని డిపార్ట్‌మెంట్ల అధికారుల సాయంతో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆర్టిసి, జిహెచ్‌ఎంసి, విద్యుత్, ఫైర్, వాటర్ వర్క్ అధికారులతో వారం రోజులు సమావేశాలు నిర్వహించామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ నుంచి శోభాయాత్రను పర్యవేక్షించామని తెలిపారు. శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగేందుకు ఏర్పాట్లు చేశామని సిసికెమెరాలు, డ్రోన్లు, మఫ్టీలో పోలీసులను బందోబస్తులో పెట్టామని తెలిపారు. రంజాన్, శ్రీరామనవమి ఒకేసారి రావడంతో ఇరు మతపెద్దలతో మాట్లాడామని తెలిపారు. ర్యాలీలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. భక్తులు ఇంటికి వెళ్లే వరకు పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News