Monday, December 23, 2024

భద్రాచలంలో రాములోరి శోభాయాత్ర

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా రామనామంతో మార్మోగుతుంది. జై శ్రీరామ్ అంటూ నినాదలు చేస్తున్నారు. లక్షలాది మంది రామ భక్తులు ఇప్పటికే అయోధ్యకు చేరుకొని రామనామంలో మునిగిపోయారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. శ్రీరాముడి పాదాల వద్ద స్వర్ణ పుష్ఫాలను ఉంచి శోభాయాత్ర చేపట్టారు. భద్రాచలంలో రాములోరితో రథయాత్ర చేపట్టడంలో ప్రజలు కాషాయ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర కొనసాగింది.  సందర్భంగా  చేపట్టారు. దీంతో భద్రాచలంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News