Monday, December 23, 2024

శ్రీ సత్యసాయి ఉచిత హోమియోక్లినిక్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోఠి సమితి ఆధ్వర్యంలో లిబర్టీ ఆప్టికల్ ప్రాం గణంలో మంగళవారం ఉచిత హోమియో క్లినిక్‌ను పున: ప్రారంభ వేడుక నిరాడంబరంగా జరిగింది. శ్రీ సత్యసాయి కోఠి సమితి కన్వీనర్ పివి శాస్త్రి స్వా గతోపన్యాసం చేయగా, సీనియర్ హోమియోపతిక్ వైద్యుడు డాక్టర్ జి దుర్గాప్రసాద్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అందరీకి ఆరోగ్యం ప రిపూర్ణంగా దక్కాలంటే మనం చేస్తున్న చికిత్సలో ప్రేమ=కరుణ నిండుగా ఉన్నప్పుడే అది సార్దకం అవుతుందన్నారు.

వైద్య సేవా ధృక్ఫథం పంచ సూత్ర పథకంలా పనిచేస్తుందని ఆయన అభివర్ణించారు. నాణ్యత, ఉచిత సేవ, విలువలతో కూడిన పని, కుల, మత, బేధం లేకుండా సమగ్ర వైద్యం అందించడ మే శ్రీ సత్యసాయి ఉచిత హోమియో క్లినిక్ ఉద్దేశ్యమని తెలిపారు. హోమియో క్లినిక్ కన్సల్టెంట్ డాక్టర్ సింధు భైరవి మాట్లాడుతూ తన ఆశయాలకు అ నుగుణంగా కోఠి సమితి పక్షాన శ్రీ సత్యసాయి ఉచిత హోమియో క్లినిక్‌లో సేవలు అందించే అవకాశ కలుగడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నా రు. భవిష్యత్‌లోనూ ఇదే స్పూర్తిని కొనసాగిస్తానన్నారు. స్థల యజమాని, లిబర్టీ ఆఫ్టిషియన్స్ అధినేత డాక్టర్ ఆదిత్య మాట్లాడుతూ తమ ప్రాంగణంలో ఉచిత హోమియో వైద్యసేవలు కొనసాగించే అదృష్టం లభించడంతో పాటు బాబా ఆశీస్సులను పొందడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇకపై హోమియో క్లినిక్‌లో ప్రతి బుధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డాక్టర్ సింధు భైరవి ఉచితంగా హోమియో వైద్యసేవలు అందిస్తారని, ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కన్వీనర్ పి వి శాస్త్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News